రాజేంద్రనగర్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ ఛాలెంజ్ ను చేపట్టిన ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి
తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గ్రీన్ ఛాలెంజ్ చేపట్టారు. జన్నాయిగూడ శ్రీలక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రీన్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా గుడి ఆవరణలో జమ్మి మొక్కను నాటారు. వాతావరణ కాలుష్యం నుంచి మానవాళిని కాపాడే చెట్లను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఆమె కోరారు. ప్రతి ఇంటి ముందు రెండు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు