అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లాలో ఆపిల్ పంటను పండించడం చాలా గర్వకారణం : జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపురం జిల్లాలో ఆపిల్ పంటను అత్యంత విజయవంతంగా పండించడం చాలా గర్వకారణం అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాలోని గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ప్రతిష్టాత్మకంగా రైతు రమణారెడ్డి పండించిన పంటను ఆయన శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఐఏఎస్ ట్రైనింగ్ లో ముస్సోరి ప్రాంతంలో ఆపిల్ పంటను చూడడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని రైతాంగానికి దీని ప్రత్యేకతను పండించే విధానాన్ని తెలియజేసేందుకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రత్యేకంగా శిక్షణ అందిస్తామని తెలిపారు.