దర్శి: తాళ్లూరు లోని బొద్దికూరపాడు బీసీ కాలనిలో జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
Darsi, Prakasam | May 17, 2025 తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు బీసీ కాలనిలో జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో 37 మంది యువత నుంచి రక్తం సేకరించి, ప్రశంసా పత్రాలను రక్తదాతలకు అందించారు. అలాగే అభిమానులకు స్వీట్స్ పంచారు. కులమతాలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు