బనగానపల్లె: సంజామల మండలంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
మానవాళి పాప పరిహారం కోసం ప్రభువైన ఏసుక్రీస్తు తన రక్తాన్ని చిందించారని పాస్టర్లు యేసయ్య, ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను పురస్కరించుకొని సంజామల మండలంలోని గిద్దలూరు, పేరుసోముల, సంజామల, ఆకుమల్ల తదితర గ్రామాల్లోని సిఎస్ఐ హోసన్న ప్రార్థన మందిరాల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి ఏసు కీర్తనలను ఆలపించారు