దర్శి: దర్శిలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 17, 2025 దర్శి ప్రజల సహకారంతోనే స్వచ్ఛ దర్శి సహకారం అవుతుందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా దర్శి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్ఛ దర్శి సహకారం అవుతుందని కావున ప్రతి ఒక్కరు అందుకు సహకరించాలని ఆమె కోరారు.