ఒంగోలు అర్బన్: కర్నూల్ మార్కాపురం ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణం: రవాణా శాఖ మంత్రి
Ongole Urban, Prakasam | Apr 23, 2026
మార్కాపురం కర్నూలు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరిగాయని పూర్తి నివేదిక వచ్చింద ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 400 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసే ట్రావెల్ బస్సులలో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండేవిధంగా నిబంధనలు రూపొందించి, నిబంధనలు పాటించని ట్రావెల్ బస్ యజమానులు పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశం మొత్తం స్లీపర్ బస్సుల ప్రమాదాలపై ఆందోళనలో ఉన్నారని దానిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.