కోడుమూరు: మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను సాదరంగా ఆహ్వానించిన కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు కెడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి బుధవారం చేరుకున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించి, నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.