నిజామాబాద్ రూరల్: డిచ్పల్లిలో కారు బోల్తా కొట్టి యువకుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
కారు బోల్తా కొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన సుశాంత్, మమ్ము అనే యువకులు నిజామాబాద్ వైపు అతివేగంగా వెళ్తుండగా ములమలుపు వద్ద అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం లో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాగా. వెంటనే స్థానికులు క్షతగాత్రులను కారు నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుశాంత్(22) మృతి చెందాగా.మమ్ము పరిస్థితి విషమంగా ఉంది.సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ప్రమాద దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.