పలమనేరు: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అనే వ్యాఖ్యలకు నిరసనగా, మెంటల్ బాలకృష్ణ అంటూ వైసీపీ శ్రేణులు ఫైర్
పలమనేరు: పట్టణం అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చిత్రపటాలను ప్రదర్శిస్తూ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అనే వ్యాఖ్యలకు నిరసనగా మెంటల్ బాలక్రిష్ణ అయ్యయ్యో పోయెనే బాలయ్య పోయెనే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బాలకృష్ణ వ్యవహార శైలి మార్చుకోవాలి ఆనాడు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ను మీరు గన్ తో కాల్చిన కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మిమ్మల్ని కాపాడిన సంగతి మర్చిపోయావ అంటూ ఆయన మాట్లాడిన మాటలను ఖండించారు విమర్శించారు.