కామారెడ్డి: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటార్ శ్రీకాంత్
కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటలకు బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాల వేసి అనంతరం జాతీయ జండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు.