ఒంగోలు అర్బన్: గుర్తుతెలియని చిన్నారి మృతిపై దర్యాప్తు చేస్తున్నామని ఒంగోలు ఎస్సై చౌడయ్య వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యం కావడంపై ఒంగోలు ఎస్సై చౌడయ్య వివరాలు వెల్లడించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును తీసుకువచ్చి అక్కడ పడవేసి వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై చౌడయ్య తెలిపారు.