పటాన్చెరు: బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న భారతీయ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి శుక్రవారం గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. లెక్చరర్లు, విద్యార్థులు కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించారు. పూలతో పేర్చిన బతుకమ్మను ఆడుతూ విద్యార్థులు, అధ్యాపకులు ఆనందోత్సాహాలతో బతుకమ్మ ఆడుతూ సంబురాలు జరిపారు.