హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ యూసీఈఎస్టీహెచ్ మెకానికల్ ఇంజనీరింగ్ 1993 బ్యాచ్ పూర్వ విద్యార్థి పి. రామ కృష్ణ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం రూ.1 లక్ష విరాళం అందించారు. “అట్లూరి మోహన్‌దాస్ మాస్టారు స్మారక స్కాలర్షిప్”గా ఏర్పాటు చేసిన ఈ సహాయం ఐదుగురు విద్యార్థులకు రూ.20 వేల చొప్పున లభించింది. ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ డా. టి. కిషన్ కుమార్ రెడ్డి అభినందించారు.