నిజామాబాద్ సౌత్: మహిళల ఆరోగ్యం కోసo స్వస్థ నారి సశక్తి పరివార్అభియాన్ కార్యక్రమన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
మహిళల ఆరోగ్యం పెంపొందించుట కోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వస్థనారి సశక్తి పరివార్ కార్యక్రమం బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రారంభిoచినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ నూతన కార్యక్రమం ఈరోజు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ పలువురు అధికారులు హాజరయ్యారు. తదనంతరం పట్టణంలోని దుబ్బ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని MLA ధన్పాల్ చేతుల మీదుగా ప్రారంభించారు.