నంద్యాల అర్బన్: నంద్యాలలో పొరక చేతబట్టి రోడ్లను ఉడ్చిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 23, 2026
నంద్యాల పట్టణ పరిశుభ్రత కోసం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శనివారం కూరగాయల మార్కెట్ వద్ద ప్రారంభించారు. రెడ్, ఎల్లో స్పాట్ల నిర్మూలన, రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అనంతరం మంత్రి చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు.