ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో పోలీస్ విజువలింగ్ కార్యక్రమం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి
Ongole Urban, Prakasam | May 13, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బుధవారం పోలీస్ విజువలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన సెంటర్లను ట్రాఫిక్ నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.