అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో గుత్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుత్తి అర్ఎస్ రైల్వే క్రీడా మైదానంలో శుక్రవారం కార్యక్రమంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి యుగంధర్ రెడ్డి, గుత్తి జడ్పీ హెచ్ ఎస్ గర్ల్స్ హైస్కూల్ పీఈటి కాంచనలు ముఖ్య అతిథులుగా హాజరైలు పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 5జట్లు పాల్గొంటాయన్నారు. ఫైనల్ ఓటు ఈ నెల 11న జరుగుతాయని పోటీలలో విన్నర్స్, రన్నర్స్ లకు ప్రత్యేకంగా ట్రోఫీలను అందజేస్తామని తెలిపారు.