డోన్: గుంతకల్లు- మార్కాపురం నూతన రైలు ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేసిన బేతంచెర్ల సిపిఐ నాయకులు
Dhone, Nandyal | May 12, 2026 నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో గుంతకల్లు-మార్కాపురం నూతన రైలు ఏర్పాటు చేయడం పట్ల సీపీఐ నాయకులు హర్ష వ్యక్తం చేశారు. మండల కార్యదర్శి భార్గవ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి అజామ్ బేగ్ బేతంచెర్ల రైల్వే స్టేషన్లో నూతన రైలుకు స్వాగతం పలికారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. అలాగే గతంలో ప్రజలందరికీ ఉపయోగపడిన హుబ్లీ, విజయవాడ రైలు పునరుద్ధరించాలని కోరారు.