కరీంనగర్: భర్త బతికి ఉండ గానే 10 సంవత్సరాలుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్న మహిళపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన భర్త
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు తాను బతికి ఉండ గానే డెత్ సర్టిఫికెట్ తీసుకొని నా భార్య వితంతు పెన్షన్ తీసుకుంటుంది అంటూ పిల్లి రాజమౌళి ఫిర్యాదు చేసినట్లు మంగళవారం తెలిపారు. నిన్న ప్రజావాణి కార్యక్రమంలో పిల్లి భారతి అనే మహిళ పోచంపల్లి గ్రామంలోని తన భూమి ప్రభుత్వం అవసరాలకు తీసుకుని నాకు ఉద్యోగం ఇచ్చిందని, ఆ ఉద్యోగం తన కొడుకుకు ఇవ్వాలని కాసేపు హంగామా చేయడంతో పోలీసులు అక్కడి నుంచి పంపించారు. పిల్లి భారతి వేధింపులు తట్టుకోలేక భర్త ఇంటి నుంచి పదేళ్ల కింద వెళ్ళిపోయాడు, తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి మరణ ధ్రువీకరణ పత్రం పొంది, తన భూమిని తీసుకుందని, వితంతు పింఛన్ కూడా తీసుకుంటుందన్నారు.