వాహనాలలో అక్రమంగా నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటాం: బాపట్ల సిఐ రాంబాబు
వాహనాలలో అక్రమంగా నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని బాపట్ల సీఐ రాంబాబు హెచ్చరించారు. ఆదివారం బాపట్లలోని చీలురోడ్డులో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలలో లగేజ్‌ని తనిఖీ చేశారు. నిషేధిత వస్తువుల పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనదారులు కృషి చేయాలన్నారు. పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు.