పలమనేరు: హాస్టళ్ళను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు.
పలమనేరు: పట్టణంలోని రెండు హాస్టళ్ళను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల ఎస్సీ బాలుర హాస్టళ్ళను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో అందుతున్న మెనూ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీయడమే గాక పరిసరాలను పరిశీలించారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు హాస్టల్ ఆవరణలో ఏదేని ఇబ్బందులు తలెత్తయా అని విద్యార్థులను అడిగారు. అదేవిధంగా దోమల బెడదతో పాటు చలి తీవ్రతకు చేపట్టిన చర్యలపై హాస్టల్ వార్డెన్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ఆయన దుప్పట్లను అందజేశారు.