మిర్యాలగూడ వద్ద మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
'చలో పిడుగురాళ్ల' మెడికల్ కాలేజీ నిరసనలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని శుక్రవారం మిర్యాలగూడెం వద్ద ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల కోసం పోరాడే ప్రతిపక్ష నాయకులను పక్క రాష్ట్రాల్లో ఉన్నా అరెస్టు చేయడం దారుణమని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఇంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.