అనంతపురం జిల్లా పామిడి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో అనుంపల్లి గ్రామానికి చెందిన వై రాజశేఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.