బనగానపల్లె: ఈనెల 9న బనగానపల్లెకు సీఎం చంద్రబాబు రాక : కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 9న బనగానపల్లెలో పర్యటిస్తారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.సంబంధిత శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఎం పర్యటన విజయవంతం చేయాలని సూచించారు.