కోవెలకుంట్ల పరిధిలో జురెరు వాగులో మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పరిధిలోని జుర్రెరు వాగులో సోమవారం మృతదేహం లభ్యమైనట్టు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన బాలకృష్ణ (30) ఆదివారం జుర్రేరు వాగులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఇవాళ మృతదేహం లభ్యమయ్యింది. భార్య రాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.