నల్గొండ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్షన్ క్లర్క్ భార్గవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్షన్ క్లర్కుగా పనిచేస్తున్న భార్గవ్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్షన్ క్లర్కుగా పనిచేస్తున్న భార్గవ్ ఉద్దేశపూర్వకంగా ICI ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ఆపి ఇబ్బందులు కలిగించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు సమగ్ర విచారణ జరిపగా,గతంలో ఏజెన్సీల ద్వారా తన వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించినట్లుగా వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా పనిచేసిన వారిపై ఎలాంటి మినహాయింపులు లేవన్నారు