వ్యభిచార గృహంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్
Ongole Urban, Prakasam | Apr 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ లోని నాలుగో లైన్ లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఒంగోలు వన్ టౌన్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురు పురుషులు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహిళను హోముకు తరలించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నిత్యం జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన రహస్య సమాచారం మేరకు వన్టౌన్ సిఐ నాగరాజు తన సిబ్బందితో దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు