ఒంగోలు అర్బన్: ఒంగోలులో పర్యటించిన రాకాస చిత్ర యూనిట్, సినిమా ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన గెటప్ శ్రీను
Ongole Urban, Prakasam | Apr 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాకాస చిత్ర యూనిట్ పర్యటించింది. సినిమా ఆదరించిన ప్రతి ఒక్కరికి నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గెటప్ శ్రీను మీడియాతో మాట్లాడుతూ, అన్ని వర్గాల వారు తమ సినిమాని ఆదరించారని వారందరికీ మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తరుపున కృతజ్ఞతలు చెబుతున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు మరికొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత తాము ఒంగోలుకు వచ్చినట్లు తెలిపారు.