తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలోని ఆకుతోటదిబ్బ ఫౌండేషన్ స్కూల్ వద్ద కరెంట్ స్తంభం శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడి మధ్యలో ఇనుపచువ్వలు పైకి తేలాయి. బలమైన గాలులు వీస్తే స్తంభం అటు ఇటు కదులుతోంది. ఏ క్షణమైనా కూలిపోయేలా ఉందని ఇదే విషయాన్ని పబ్లిక్ న్యూస్ యాప్ లో శనివారం వార్త రావడంతో విద్యుత్ శాఖ ఏఈ అనంతరావు స్పందించారు.. సోమవారం స్తంబాని తొలగింపజేశారు.. దీనితో తల్లిదండ్రులు, టీచర్లు హర్షం వ్యక్తం చేశారు