నారాయణపేట్: ఇస్రో అంశాలు విద్యార్థులకు అందించాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఇస్రో ను సందర్శించిన ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో అక్కడి అంశాలు విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం ఐదు గంటల సమయంలో క్యాంపు కార్యాలయంలో జిల్లా సి వి రామన్ సైన్స్ ఫోరం సభ్యులు కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని ఇస్రో సందర్శనకు అనుమతి ఇచ్చినందుకు కలెక్టర్ కు జ్ఞాపకం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఇస్రో సందర్శన వివరాల గురించి ఫోరం సభ్యులు కలెక్టర్ కు తెలిపారు.