డోన్: డోన్ బాలికల ఉన్నత పాఠశాలలో తేనెటీగల తట్టను తొలగించిన అగ్నిమాపక సిబ్బంది
Dhone, Nandyal | Apr 3, 2026 డోన్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కొద్ది రోజుల క్రితం విద్యార్థులు తేనెటీగల దాడికి గురయ్యారు. శుక్రవారం డోన్ అగ్నిమాపక సిబ్బంది పాఠశాల ప్రాంగణంలో చేరారు. ప్రత్యేక పద్ధతుల ద్వారా తేనెటీగల తట్టును జాగ్రత్తగా గుర్తించి, విద్యార్థులు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం లేకుండా తొలగించారు. పాఠశాల ఉపాధ్యా యులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారన్నారు.