నేరాలకు దూరంగా ఉండాలి — రౌడీ షీటర్లకు కర్నూలు పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం కర్నూల్ జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.సత్ప్రవర్తనతో జీవించి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మళ్లీ నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.