కావలి: జాతీయ రహదారిపై ఆందోళన...
కావలి పట్టణంలోని బుడంగుంట ఇందిరమ్మ ఎస్సీ కాలనీకి చెందిన పలువురు బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జమ్మలపాలెం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.తమ కాలనీలో ఎస్సీలకు ప్రభుత్వం 200 యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇస్తోందని చెప్పారు. ఈనెల ఒక్కొక్కరికి రూ.వేల నుంచి రూ. లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. అవి కట్టకపోవడంతో అధికారులు కనెక్షన్ కట్ చేయగా.. కాలనీవాసులు ఆందోళనకు దిగారు.