అన్నమయ్య జిల్లా రాయచోటి లో యువకుడి పై బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరచారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు కుటుంబీకుల కథనం మేరకు.. మాసాపేటలో ఉంటున్న అజీమ్ (24) స్థానిక చిత్తూరు రోడ్డులో ఉన్న ఓ మద్యం షాపు వద్ద కు వెళ్ళాడు. అక్కడే ఉన్న ఆశీఫ్, మస్తాన్, రెడ్డిబాషా, శివారెడ్డి లు పాత కక్షలు మనసులో పెట్టుకుని బీరు బాటిళ్లతో దాడి చేశారు. గాయపడిన బాధితుని స్థానికులు గమనించి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.