గుర్రంపోడు: మండల కేంద్రంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాబృందం ప్రదర్శన
నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ కళాబృందం ప్రదర్శన సోమవారం సాయంత్రం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో ఉన్న వస్తువులలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, వాటి ద్వారా దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆటపాటల ద్వారా వివరించారు.