అనంతపురం అర్బన్: నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | May 6, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న సచివాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు పాలు కాగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. తో అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచినట్లుగా వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.