ఒంగోలు అర్బన్: పొగాకు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 27, 2026
పొగాకు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే ( నో బిడ్ ) కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. కొనుగోలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దగ్గర ప్రత్యేకంగా సమావేశం జరిగిన తర్వాత కూడా కంపెనీల ధోరణిలో మార్పురాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పొగాకు బేలును కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. శనివారం ఆయన ఒంగోలు - 1, ఒంగోలు - 2 పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేశారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీతో కలిసి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతోనూ, కొనుగోలుదారులతోనూ ఈ సందర్భంగా ఆయన చర్చించారు.