నారాయణపేట్: జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం 9 గం సమయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ 9 గం సమయంలో జె డ్పి సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో స్వచ్ఛత హి సేవకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జడ్పీ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాలు 2025 లో భాగంగా స్వచ్ఛత హి సేవకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.