పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 12 మోటర్లు ఆన్ చేసి 4200 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసిన అధికారులు.
పోలవరం మండలం పట్టిసం ఎత్తిపోతల పథకంలోని 12 మోటార్లను ఆన్ చేసి 4200 క్యూసెక్కులగోదావరి నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసిన అధికారులు. కృష్ణానది నుండి కృష్ణా డెల్టాకు నీరు లేకపోవడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మోటార్లను ఆన్ చేసి కుడి కాల్వ ద్వారా నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 12 మోటర్ల ద్వారా నీటిని విడుదల చేసామని అవసరమైతే మోటార్లు సంఖ్య పెంచుతామని తెలిపారు.ప్రస్తుతం గోదావరి నీటిమట్టం పట్టిసం ఎత్తిపోతల వద్ద 14.06 మీటర్లుగా ఉంది.