నందికోట్కూరు: బ్రాహ్మణ కొట్కూరులో ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్ 8160 నగదు స్వాధీనం : ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు, బ్రాహ్మణ కొట్కూరు సమీపంలోని కుంట కంపచెట్లలో అందర్ బాహార్ అనే పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసి, వారివద్ద నుంచి 8160 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మణికంఠ వెల్లడించారు, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.