తిరుమల పాలెం లో గొల్ల చెరువులో ఈతకు వెళ్లి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రాజు (14) నీట మునిగి మృతి
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమల పాలెం లో గొల్ల చెరువులోకి దిగి బాలుడు నీట మునిగి మృతి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయం లో స్థానిక జడ్పీ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల వయసు గల ముద్దే రాజు దసరా సెలవులు కావడంతో సరదాగా నలుగురు స్నేహితులతో కలిసి చెరువులో దిగి నీటి మొగడంతో తోటి స్నేహితులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో గ్రామస్తులు బాలుడిని వెలికి తీసేసరికే మృతి చెందినట్లు తెలిపారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది