కర్నూలు: కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన
కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గుంటూరులో రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. వెనుక బడిన రాయలసీమ కు న్యాయం జరగాలంటే కర్నూలు లో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని న్యాయ వాదులు తెలిపారు.