నేరేడుగొమ్ము: ప్రజా ప్రభుత్వ పాలనలో పల్లె పల్లెనా ప్రగతి పరుగులు తీస్తుంది: ఎమ్మెల్యే బాలు నాయక్
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని నేరేడుగోమ్ము మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం కొత్తపల్లి పెద్దమునిగల్ గ్రామాలలో 97 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం శంకుస్థాపన చేశారు. పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ పాలనలో పల్లె పల్లెనా ప్రగతి పరుగులు తీస్తుందన్నారు. ప్రజా అవసరాల కోసం ఊరూరా సిసి రోడ్లు ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నామన్నారు.