బనగానపల్లె: యాగంటి వద్ద ఆటో బోల్తా,వృద్ధురాలు మృతి
బనగానపల్లె మండలం యాగంటి శివానందం ఆశ్రమం మలుపు వద్ద మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.