బనగానపల్లె: బనగానపల్లెలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు మొదట పెట్రోల్ బంకు సర్కిల్ వద్ద ఉన్న విగ్రహానికి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు.