బనగానపల్లె: విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సూర్య ఘర్ పథకం : బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని పంచమపేటలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 'పీఎం సూర్యఘర్' ఉత్సవాన్ని ఆదివారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, సోలార్ ప్యానెల్స్ను స్విచ్ ఆన్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100% సబ్సిడీతో ఉచిత సోలార్ ప్యానెల్స్ అందిస్తున్నామన్నారు. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందన్నారు