గుంతకల్లు: స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం. కాశీ విశ్వనాథాచారి
పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని స్వచాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం.కాశీవిశ్వనాథచారి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణం స్వర్ణాంధ్ర, స్వచాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ ఫ్రీ బైక్, ఫ్రీ బైక్, ఫ్రీ కార్ అనే నినాదంతో గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి బి.సాదు బాబు ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం.కాశీ విశ్వనాథచారి, గుత్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.శ్వేతా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కోర్టు నుంచి ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి, మన్రో సత్రం మీదుగా గాంధీ చౌక్ వరకూ సాగింది.