రాజేంద్రనగర్: వెంకట్రావు పేట గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
తలకొండపల్లిలోని వెంకట్రావుపేట గేట్ సమీపంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ పోలే రాములు అక్కడికక్కడే మృతి చెందినట్లు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. గాయపడిన ఆయనను 108 అంబులెన్స్‌లో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది