ముసలిమడుగు గ్రామంలో ఇంటి వద్ద చెత్త ఊడ్చే విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం మనస్థాపంతో వ్యక్తి మృతి
కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామంలో ఇంటి వద్ద చెత్త ఊర్చే విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్థాపం చెంది బోయ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కుటుంబాల మధ్య ఇంటిపక్కల చెత్త ఊర్చే విషయంలో మాట మాటకు పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం, ఈ సంఘటనపై ముందే పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు పట్టించుకోకపోవడంతో,బోయ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని డిఎస్పి కి ఫిర్యాదు చేశారు.