బనగానపల్లె: ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 30% సీట్లు కేటాయించాలి: బనగానపల్లె జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి
ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 30 శాతం సీట్లు కేటాయించాలని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పలుకూరు గ్రామంలో ఆయన మాట్లాడారు.బస్సుల్లో సీట్లు దొరకక పురుషులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, పురుషుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.